గోస్పాడు శాఖ గ్రంథాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో శుక్రవారం వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులతో ప్రతి ఒక్కరితో పుస్తక పఠనం చేయించి, మీరు చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది ఉద్యోగ సాధన సమకూరుతుంది హోదాతో పాటు కీర్తి , ఆర్థిక స్తోమత పెరుగుతుంది, తల్లిదండ్రులకు పేరు సంప్రదిస్తుంది కావున మీరు ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరుచున్నానన్నారు. చదువు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. తదుపరి మ్యూజికల్ చైర్స్ ఆటను విద్యార్థులతో ఆడించారు. వీరికి చల్లని నీరు బిస్కెట్ ప్యాకెట్లను గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని గారు అందజేశారు. ప్రతి దినం పుస్తకం చదవటం మర్చిపోవద్దని హిత బోధ చేశారు.