నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో జరుగుతున్న డ్రైనేజీ, కల్వర్టు పనులను నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయ సూర్య శనివారం గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. పనులలో అవకతవక జరగకుండా నాణ్యమైన మెటీరియల్ తో చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.