నంద్యాల జిల్లా పగిడ్యాల తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10:00 గంటలకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (గ్రీవెన్స్) ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య పాల్గొని, ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొనవలసిందిగా సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.