నందికొట్కూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదినగర్, మారుతి నగర్ లో రోడ్లన్నీ జలమయం కావడంతో గురువారం సిపిఐ పార్టీ నాయకులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు రఘురామమూర్తి ఆధ్వర్యంలో వరద నీటిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామమూర్తి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల పంట పొలాల నుంచి వచ్చిన వరద నీరు రోడ్లపై ప్రవహించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.