పాములపాడు గ్రామాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని గ్రామాల అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తుమ్మలూరు కృష్ణాపేట గ్రామాలలో పల్లె పండే కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా పల్లెల్లో పూర్వ వైభవము వస్తుందని అన్నారు.