కోడుమూరు మండలంలోని గ్రామాల్లో రీసర్వేలో భాగంగా వచ్చిన భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తహసీల్దార్ వెంకటేష్ నాయక్ అన్నారు. రీసర్వే నిర్వహించిన గ్రామాల్లో నెలకొన్న భూసమస్యల పరిష్కారం కోసం శుక్రవారం అమడగుంట్లలో తహసీల్దార్ వెంకటేష్ నాయక్ గ్రామ సభ నిర్వహించారు. వారు మాట్లాడారు. గ్రామసభలో మొత్తం 45 మంది రైతులు వివిధ రకాల భూసమస్యలపై అర్జీలిచ్చారని తెలిపారు. డీటీ క్రిష్ణమూర్తి, సర్వేయర్ సునీల్ ఉన్నారు.