పలు కంపెనీల్లో ఉద్యోగాలకు 20 మంది నిరుద్యోగ యువత ఎంపికైనట్లు కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. 89 మంది నిరుద్యోగులు హాజరైనట్లు పేర్కొన్నారు. ప్లేస్ మెంట్ అధికారి సాయితేజ, నైపుణ్యాభివృద్ధి సమన్వయకర్త హరిబాబు, ఏపీఎస్ఎస్డీసీ, యంగ్ ఇండియా తదితర పలు కంపెనీల సిబ్బంది పాల్గొన్నారు.