ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సి. బెళగల్ మండల వ్యవసాయ అధికారి మల్లేష్ కుమార్ అన్నారు. మంగళవారం సి. బెళగల్ రైతు సేవా కేంద్రంలో రైతులు, గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన సదస్సు నిర్వహించి, మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి తగు సమాచారం పొందవచ్చని, నిర్ణీత సమయంలో అధికారులు సమాచారం ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు అపీల్ చేయవచ్చని తెలిపారు.