కోడుమూరు: యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు

55பார்த்தது
కోడుమూరు: యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు
కూరగాయల సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని కర్నూలు జిల్లా ఆత్మ పీడీ రత్నకుమార్ సూచించారు. బుధవారం కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో కూరగాయల సాగుపై పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో రవిప్రకాష్, హెచ్ఓ మధన్మోహన్ నిర్వహించారు. కొత్త వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. పండ్లు, కూరగాయల తోటలను ఎక్కువమంది సాగు చేస్తున్నారని, మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி