రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కోడుమూరు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. శుక్రవారం కోడుమూరు సీపీఎం మండల కార్యదర్శి గఫూర్ మియా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రూఫ్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై ఎనలేని భారం మోపిందని, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలన్నారు. ఎన్నికల కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.