కోడుమూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 14 మద్యం దుకాణాలకు శుక్రవారం గడువు ముగిసే సమయానికి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో 507 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోడుమూరు సర్కిల్ పరిధిలో భారీగా దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 14వ తేదీ కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే డ్రా ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాలను కేటాయించడం జరుగుతుందని సీఐ మంజుల పేర్కొన్నారు.