ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని గూడూరు ఎస్సై తిమ్మయ్య సూచించారు. శనివారం ఎస్సై తిమ్మయ్య తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆయన మాట్లాడారు. ప్రతి వాహనదారుడు వాహనానికి సంబంధించి పత్రాలతోపాటు, డ్రైవింగ్ లైసన్ తప్పక కలిగివుండాలన్నారు. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే చలానాలు విధిస్తామని ఎస్సై హెచ్చరించారు. సరియైన పత్రాలు లేని ఎనిమిదిమంది వాహనదారులకు చలానా విధించారు.