మార్కెట్ యార్దులో నిల్వ ఉన్న ఇసుక మాయమైంది

79பார்த்தது
మార్కెట్ యార్దులో నిల్వ ఉన్న ఇసుక మాయమైంది
ఆళ్లగడ్డ నూతన వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇసుక మాయమైన సంఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆళ్లగడ్డలోని ఇసుక డంప్ యార్డ్ ను ఆయన సందర్శించారు. నూతన మార్కెట్ యార్డులో ఇసుక మాయమైందని పేద ప్రజల గృహ నిర్మాణాల కోసం కేటాయించిన 620 మెట్రిక్ టన్నుల ఇసుక మాయం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி