సీఎస్ఆర్ పథకం కింద పాఠశాలకు ఆటో మంజూరు

81பார்த்தது
ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ భారతి విద్యా మందిరం పాఠశాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద రూ. 3 లక్షల విలువచేసే ఆటోని శనివారం ఆలమూరు కెనరా బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ సందీప్ పంపిణీ చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి కెనరా బ్యాంక్ డీజీఎం కానాల రాఘవేంద్రరావు కృషిచేసి మంజూరు చేయించినట్లు మేనేజర్ సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ వేణుగోపాల్, మురళీధర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி