ఆదోనిలో బుధవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా అశాంతిని సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం హెచ్చరించారు. మత సామరస్యానికి మారుపేరుగా ఆదోని ఉందన్నారు. హిందూ, ముస్లింలు కలిసి మెలిసి వేడుకలు నిర్వహించు కోవడం తాను గమనించానన్నారు. బక్రీదు నమాజులో తాను పాల్గొని ముస్లింల మనోభావాలు తెలుసుకున్నానని చెప్పారు.