ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సోమవారం మిలాద్-ఉన్-నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మతంలో ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజునే ఈద్ మిలాద్-ఉన్-నబీగా జరుపుకుంటారని గుర్తు చేశారు.