నందవరం మండలం హాలహర్వి గ్రామ దళితులు బియ్యం, కొత్త బట్టలు, కొంత ఆర్థిక సహాయాన్ని విజయవాడ వరద బాధితుల సహాయార్థం సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ పాల్గొని మాట్లాడారు. ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న లక్ష్యంతో విజయవాడ వరద బాధితులకు మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు అండగా నిలిచారన్నారు.