ఆదోని సిరుగుప్ప చెక్ పోస్ట్ బైపాస్ రహదారి, ఆలూరుకు వెళ్లే మార్గంలో అనేక గుంతలతో దెబ్బతింటోంది. ఇటీవల పాడైన రహదారి వల్ల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నీటి కుంటల ఏర్పడటంతో ప్రయాణం కష్టం అయిపోయింది. సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనాఅధికారులు ఈ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహించమని వాహనదారులు కోరుతున్నారు.