పెద్దకడుబూరులో వింత ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంటి దగ్గర వేపచెట్టుకు పాలు ధారగా కారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా గ్రామంలో వేప చెట్టుకు పాలధార కారడం తొలిసారి అని చర్చించుకుంటున్నారు. వేపచెట్టు వద్దకు చేరుకుని వేప చెట్టులో నుంచి స్వయంగా వస్తున్న పాలను ప్రజలు వీక్షించారు.