ఆదోని: గుంతల మయంగా రహదారి
ఆదోని నుంచి మాధవరం మీదుగా రాయచూర్ కు వెళ్ళే ప్రధాన రహదారి గుంటలమయంగా మారింది. రచ్చుమర్రి గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డు చీలిపోయి గుంత ఏర్పడటంతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం లేకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.