నాసిరకం పత్తి విత్తనాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన రైతు చిన్న తెలిపారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మొక్కలతో నిరసన చేపట్టారు. పట్టణంలోనే భువనేశ్వరి సీడ్స్ దుకాణంలో కావేరి కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మూడు ఎకరాల్లో నాటామన్నారు. ఏపుగా మొక్క పెరిగింది కానీ కాయలు రాలేదని ఆరోపించారు.