ఆదోని మండలం ఇస్వి గ్రామంలో పిల్లల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం బాధితులు ఈ విషయం మీడియాకు తెలియజేసారు. ఒక వర్గంలో ముగ్గురికి(ప్రవన్, మల్లికార్జున, రూత్ అమ్మకు గాయాలు), మరో వర్గంలో ఇద్దరికీ ( దేవేంద్ర, హుసేని)కి గాయాలైనట్లు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని బాధితులు తెలిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి 9 గంటలకు జరిగిందన్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు.