ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించండి: సబ్ కలెక్టర్

83பார்த்தது
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించండి: సబ్ కలెక్టర్
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ ఆఫీసును అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి 100 రోజుల ప్రణాళికపై శాఖల వారీగా సమీక్షా నిర్వహించారు. ఆయా శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇందులో తహసీల్దార్ శ్రీనాథ్, ఎంపీడీఓ జనార్దన్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி