రాష్ట్రం కాపు సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబునాయుడుతోనే మేలు కలుగుతుందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. శుక్రవారం ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గడిచిన అయిదేళ్ల జగన్ పాలనలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కాపుల అభివృద్ధికి 2014-19 అప్పటి చంద్రబాబునాయుడు అమలుచేసిన పథకాన్నింటినీ తరవాత జగన్ నిలిపేశారన్నారు.