ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది అని అన్నారు.