ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవం వేడుకలకు సంబందించిన గోడ పత్రికను సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈశా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం అనే ప్రత్యేకమైన క్రీడా వేడుకను నిర్వహించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటలు ఆడడం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, వ్యసనాలు, అనారోగ్యకరమైన జీవనశైలి నుండి పజ్రలను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు ముఖ్యకార్యదర్శి వినయ్ చంద్, ఈశా ఫౌండేషన్ వాలంటీర్లు రాఘవ్ ముఖుంద్, రాధిక జీవి, భరత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.