పెనమలూరు: పోరంకిలో మాజీ సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం
జగ్గయ్యపేట నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరైయ్యారు. పోరంకి లోని మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు సారూప్య, వరుడు యశ్వంత్ రాజా(మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు) లకు జగన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జగన్ ఎంట్రీతో కార్యకర్తలు, నాయకులు జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.