కంకిపాడుకు పక్కా డ్రైయినేజీ ఏర్పాటు చేయించండని డిప్యూటీ సీఎం పవన్ కు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం జరిగిన పల్లె పండుగ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కంకిపాడులో ప్రధాన రహదారి వెంబడి పక్కా డ్రైయినేజీని ఏర్పాటు చేయాలని సభలో పవన్ కు బోడే ప్రసాద్ ప్రత్యేకంగా వినతి పత్రాన్ని అందజేశారు.