పెనమలూరు: మంత్రి కీలక ప్రకటన
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులు వారు తీసుకున్న పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లింపు మారిటోరియం (తాత్కాలిక నిషేధం)తో కలిపి రెండు సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.