కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన కైలే వేంకటేశ్వర రావు అలియాస్ సువర్ణ రాజు అనే ఓ రైతు తన ఇంటి పెరట్లో 6. 6 అడుగుల భారీ పొట్లకాయను పండించాడు. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా కూరగాయ వ్యర్థాలతో కూడిన ఎరువును మాత్రమే వేసి పండించాడు. ఈ పాదుకు కాసిన కాయలన్నీ కూడా ఇంతే భారీ విధంగా కాయడం రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.