మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. సోమవారం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడె ప్రసాద్, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, హుజూర్నగర్ పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని తదితరులు పాల్గొన్నారు