పెడన మండలం మడకలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెట్రోలు బంకు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.