పెడన నియోజకవర్గంలోని పెనుమల్లి గ్రామంలో రామాలయం దగ్గర నుంచి పెనుమల్లి సెంటర్ వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న వర్షం పడినా నీళ్ళు నిలిచి నడిచి వెళ్ళే వాళ్లకు, వాహనాలు మీద వెళ్ళే వాళ్లకు ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. నిత్యం కొన్ని వందల మంది ఈ రోడ్డులో ప్రయాణం సాగిస్తుంటారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.