పెడన నియోజకవర్గం కమలాపురం వద్ద వడ్లమన్నాడు - సింగరాయపాలెం ఆర్అండ్ బి రహదారి ప్రమాదకరంగా మారింది. రహదారి ఒకపక్కకు కోతకు గురి కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ద్విచక్ర వాహనదారులతోపాటు కార్లు, ఆటోలో డ్రైవర్లు సైతం భయపడుతున్నారు. ఈ రహదారి విషయమై ఆర్ అండ్ బి శాఖ అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, వాహదారులు కోరుతున్నారు.