రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం మడక గ్రామంలో మనఇల్లు - మన గౌరవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి పాలనలో ప్రారంభించిన గృహాలు పూర్తి చేయాలని, కూటమి ప్రభుత్వ అందుకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.