ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పెడన పురపాలక సంఘం మున్సిపల్ చైర్ పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ తెలిపారు. శనివారం స్వచ్ఛత హీ సేవ-2024 కార్యక్రమంలో భాగంగా పెడన పురపాలక సంఘంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. పెడన మున్సిపల్ కమిషనర్ గోపాల్ రావు మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.