కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని రాష్ట్ర సమాచార పూర్వ సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి కొనియాడారు. శనివారం పామర్రు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన మొవ్వలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీని మంత్రి కొలుసు పార్థసారథి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.