రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని పామారు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన పామర్రు విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. దైవ దర్శనంకి వెళ్ళటానికి వీలు లేదని పేర్కొంటూ నోటీసులు జారీ చేయటం సిగ్గుచేటు అని అన్నారు.