కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి వైద్య సహాయం అందిస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నూజివీడు క్యాంపు కార్యాలయంలో జరపాల భవానికి రూ. 98, 708 సీఎం రిలీఫ్ ఫౌండర్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా కోట్లు ఖర్చు చేసి పేదలకు వైద్యం అందించిందన్నారు.