ముసునూరులో అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేయడమైందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ తెలిపారు. ఈ దాడుల్లో అనగాని సీతామహాలక్ష్మి అనే మహిళ వద్ద నుండి అక్రమంగా కలిగి వున్న 20 ఎన్ డి పి ఎల్ మద్యం సీసాలను స్వాధీన పరుచుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడమైనదని ఫణి కుమార్ తెలిపారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.