నూజివీడు నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ఆదివారం నూజివీడు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ ఆయన సందర్శించారు. కాలనీకి వసతులు కల్పించడంలో అధికారుల తీరు పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ మొత్తం అధికార యంత్రాంగం పనితీరు బాగోలేదని ఆయన అసహన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.