ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సిడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నూజివీడు గవర్నమెంట్ ఐటీఐలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వాడపల్లి కిశోర్ బుధవారం తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, వరుణ్ మోటార్స్, మెడ్ ప్లస్ ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చేసి 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అర్హులన్నారు.