ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో ఉన్న ఉయానా మోనస్ట్రీలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకుడు జంపాల సత్యనారాయణరాజు శనివారం తెలిపారు. ఆయుర్వేదం, హోమియోపతి, ఫిజియోథెరపీ, మానసిక వైద్యులు పరీక్షలు చేస్తారని తెలిపారు. అలాగే జనరల్ మెడిసిన్, కంటి, ఎముకలు, కీళ్ళు, చెవి, ముక్కు, గొంతు, దంత, గుండె, క్యాన్సర్, చిన్న పిల్లల, ఊపిరితిత్తుల పరీక్షలు చేస్తారని తెలిపారు.