రెడ్డిగూడెం మండల అభివృద్ధి కోసం అధికారులందరూ ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేయాలని మండల పరిషత్ అధ్యక్షులు రామినేని దేవి ప్రవీణ్య వీరస్వామి నాయడు అన్నారు. ఆదివారం మండల పరిషత్ సభా మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.