జి. కొండూరు మండలం గడ్డమనుగు గ్రామములోని జగనన్న కాలనీకి వెళ్ళు రోడ్లను, దెబ్బతిన్న పంట పొలాలను, గ్రామంలో వరద వల్ల నీటమునిగిన ఇళ్లను మండల ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ పరిశీలించారు. వారికీ భరోసా కల్పించారు. జగనన్న కాలనీ రోడ్లను అభివృద్ధి చేస్తామని, పంట నష్టాలను గుర్తించి నష్టపరిహారం అందేలా అధికారులతో మాట్లాడతానని తెలిపారు.