తడి, పొడి చెత్తను వేరుగా అందించాలి: కలెక్టర్

70பார்த்தது
మచిలీపట్నంలోని నగర ప్రజలు తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నేషనల్ కాలేజ్ సమీపంలో భారీగా డంపింగ్ యార్డ్ లో చెత్త పేరుకు పోయిందని తెలిపారు. ఈ వ్యర్ధాలు తొలగించడం కష్టతరంగా మారిందన్నారు. రాబోయే తరాలకు మంచి చేయాలని ఉద్దేశంతో తడి, పొడి చెత్తను వేరుగా అందించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி