సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.