మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం బయట తమ సమస్యల పరిష్కారం కొరకు అసోసియేషన్ నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పీహెచ్ సీల నుంచి వచ్చిన డాక్టర్లు హాజరయ్యారు.