రాష్ట్ర ముఖ్యమంత్రి మచిలీపట్నంకు వరాలజల్లు కురిపించడంతో మహర్దశ పట్టనుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంలో స్వచ్చత హీ సేవ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం పర్యటన విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం చెత్తపై పన్ను రద్దు చేస్తానని హామీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.