గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిసిసి ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మార్పిడీ బాబ్జి అన్నారు. బుధవారం మచిలీపట్నంలోని కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టాభి భవనం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లు కృష్ణ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. మార్పిడీ బాబ్జి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందన్నారు.